IND vs ENG: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు..!

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు, టీ20 సిరీస్‌ను తమ పేరుపై లిఖించుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తవగా.. భారత జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇది ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల జట్టుకు మొదటి టీ20 సిరీస్ విజయం, అందుకే ఈ గెలుపును చరిత్రాత్మక విజయంగా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

నాలుగో టీ20 మ్యాచ్ హైలైట్స్:
గత రాత్రి మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు రాణించడంతో వారు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 126 పరుగులకే పరిమితమయ్యారు. బౌలింగ్‌లో రాధా యాదవ్, శ్రీ చరణి, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ మంచి ప్రదర్శన చూపారు.

127 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన భారత జట్టు సునాయాసంగా విజయం సాధించింది.

బ్యాటింగ్‌లో:

స్మృతి మంధన – 32 పరుగులు

షెఫాలి వర్మ – 31 పరుగులు

జెమిమా రోడ్రిగ్స్ – 24* పరుగులు

హర్మన్ ప్రీత్ కౌర్ – 26 పరుగులు
రాణించడంతో భారత జట్టు 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ సిరీస్‌లో 5వ మరియు చివరి టీ20 మ్యాచ్ జూలై 12న జరగనుంది. అయితే ఇప్పటికే సిరీస్ భారత్ వశం కావడంతో, చివరి మ్యాచ్‌లో జట్టు మరింత ప్రయోగాలకు దిగే అవకాశం ఉంది.

Leave a Reply