Ind vs Pak: పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్.. భారత కెప్టెన్‌గా యువరాజ్ సింగ్!

క్రికెట్ అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూసే పోరు అంటే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. ఏ పనిలో ఉన్నా, ఈ జట్ల మధ్య పోరు ఉంటే టీవీల ముందు కూర్చుంటారు. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం రాబోతోంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌గా ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ బర్మింగ్‌హామ్‌లో రాత్రి 9 గంటలకు తలపడతాయి.

జూలై 20న భారత్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇదే భారత్‌కు ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ కావడం విశేషం. బర్మింగ్‌హామ్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా ఛాంపియన్స్ జట్టుకు కెప్టెన్‌గా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బాధ్యతలు చేపట్టాడు.

ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ చేరింది. జట్టులో సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్, అంబటి రాయుడు, నమన్ ఓజా, ఆర్పీ సింగ్ వంటి మాజీ స్టార్ ప్లేయర్లు ఉన్నారు. 2024లో జరిగిన తొలి ఎడిషన్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. 2025లో మరోసారి టైటిల్ గెలుచుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply