Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్‌.. జరిమానా తో పాటు..

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి క్రమశిక్షణా చర్యలు ఎదురయ్యాయి. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో సిరాజ్ ప్రవర్తనపై ఆగ్రహించిన ఐసీసీ, అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. అంతేకాదు, అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేసింది.

మ్యాచ్ నాలుగో రోజు, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్ (12) ఔట్ అయిన సందర్భంలో సిరాజ్ అతడి వద్దకు వెళ్లి దూకుడుగా సెలబ్రేషన్ చేశాడు. ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5కు విరుద్ధమని పేర్కొంది. ఇది ప్రత్యర్థి ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా అశ్రద్ధపరిచేలా ప్రవర్తించినట్లు పరిగణించబడింది.

ఒక ఆటగాడి ఖాతాలో 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే, అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. రెండు సస్పెన్షన్ పాయింట్లు ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు/టీ20ల నిషేధానికి సరిపోతాయి. ప్రస్తుతం సిరాజ్‌కు ఒక్క డీమెరిట్ పాయింట్ మాత్రమే ఉండటం వల్ల నిషేధం ప్రసక్తి లేదు కానీ, ఇది రికార్డులో నమోదు అవుతుంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగులు, భారత తొలి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగులే, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 192 ఆలౌట్, భారత్ ఛేదించాల్సిన లక్ష్యం 193 ప‌రుగులు

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 58/4తో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) ఉన్నాడు. భారత్‌కు విజయం కోసం ఇంకా 135 పరుగులు, ఇంగ్లాండ్‌కు విజయానికి 6 వికెట్లు కావాల్సిన పరిస్థితి.

Leave a Reply