హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ టికెట్ల కుంభకోణంపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.
ప్రాధమిక దర్యాప్తులో HCA ప్రెసిడెంట్ హోదాను ఉపయోగించి SRH యాజమాన్యాన్ని బెదిరించారన్న విషయం స్పష్టమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లలో 20 శాతం వాటా ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమ్యంపై జగన్మోహన్ రావు ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే SRH యాజమ్యం దీనికి ఒప్పుకోకపోవడంతో, వీఐపీ గ్యాలరీకి తాళాలు వేయించారు.
ఈ ఉదంతం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో, విజిలెన్స్ శాఖకు విచారణ ఆదేశాలు జారీ అయ్యాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి, చివరికి జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.