RR vs KKR: రియాన్ పరాగ్ PR స్టంట్? అభిమానికి డబ్బులిచ్చి మైదానంలోకి పంపించాడా?

నిన్న జరిగిన RR vs KKR మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గువాహటిలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో, సెక్యూరిటీని మోసం చేసి ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. అతను నేరుగా రియాన్ పరాగ్ వద్దకు వెళ్లి, అతని కాళ్లు మొక్కాడు. ఈ అనూహ్య ఘటనతో అక్కడి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించి ఆ అభిమానిని స్టేడియం బయటకు పంపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే, నెటిజన్లు దీనిపై విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పరాగ్‌కు నిజంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెబుతుండగా, మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ప్లాన్ చేసిన PR స్టంట్ అని ఆరోపిస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు, “మీడియా అటెన్షన్ కోసం పరాగ్ రూ. 10 వేలు ఇచ్చి ఈ స్టంట్ ప్లాన్ చేసుకున్నాడా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు. “రోహిత్ శర్మ కంటే కూడా పరాగ్‌కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా?” అంటూ మిమ్స్ వర్షం కురుస్తోంది. ఇది సహజమైన సంఘటన కాదని, పరాగ్ తన మార్కెట్ విలువను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కెప్టెన్ సంజు శాంసన్ వేలికి గాయం కావడంతో, ఐపీఎల్ 2025 సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్‌ను స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా నియమించారు. అయితే, పరాగ్ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ దారుణ ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.

రెండో మ్యాచ్ పరాగ్ సొంత నగరం గువాహటిలో జరిగింది. ఈ మ్యాచ్‌పై అతనికి భారీ అంచనాలు ఉండగా, కేకేఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ (97*) అద్భుత ఇన్నింగ్స్ ఆడి, రఘువంశీ (22*) తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కెప్టెన్‌గా రెండో మ్యాచ్‌లో కూడా పరాగ్ ఆకట్టుకోలేకపోయాడు. అతను కేవలం 25 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ రెండు పరాజయాలతో రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు, పరాగ్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ ఘటనపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. పరాగ్‌కు అద్భితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కొందరు అంటుంటే, మరికొందరు ఇది పూర్తిగా క్రియేట్ చేసిన ప్రచారం అని విమర్శిస్తున్నారు. ఇది నిజంగా స్వచ్ఛమైన అభిమానమేనా, లేక ఐపీఎల్ సీజన్‌లో క్రేజ్ పెంచుకోవడానికి ఓ వ్యూహాత్మక ప్రయత్నమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి!

Leave a Reply