Yuzvendra Chahal-RJ Mahvash: చాహల్‌ మనసు దోచుకున్న మహ్‌వశ్.. ఒక్క లైక్‌తో అదుర్స్!

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, రేడియో జాకీ మహ్‌వశ్ లవ్ స్టోరీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మహ్‌వశ్ తన భవిష్యత్తు భర్త గురించి ఓ భావోద్వేగమైన వీడియో షేర్ చేయగా, చాహల్ దానికి లైక్ కొట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌పై మరింత ఆసక్తికర చర్చ మొదలైంది.

‘హస్బెండ్’ పోస్ట్ వెనుక మిస్టరీ!
మహ్‌వశ్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేస్తూ, తన జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి తనకు స్నేహితుడిగా, ప్రియుడిగా, భర్తగా మాత్రమే ఉండాలంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇతర అబ్బాయిలతో తనకు అవసరం లేదని, తన జీవితంలోని ప్రతి అంగుళం భవిష్యత్తు భర్తకు అంకితం అవుతుందని తెలిపింది. ఇది అభిమానులను ఆశ్చర్యంలో ముంచేసింది.

అయితే అసలు షాక్ ఏంటంటే.. చాహల్ ఆ వీడియోకు లైక్ కొట్టడం! ఇది నెటిజన్ల దృష్టిని మరింతగా ఆకర్షించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా, లేక వీరిద్దరి మధ్య సీరియస్ రిలేషన్ ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Mahvash (@rj.mahvash)

చాహల్ & మహ్‌వశ్ – నడుస్తున్న రూమర్స్
ఇంతకు ముందు కూడా చాహల్, మహ్‌వశ్ స్టేడియంలో కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాక, తన మాజీ భార్య ధనశ్రీతో విడాకుల తర్వాత చాహల్ మహ్‌వశ్‌తో మరింత సమయం గడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటికి ఇప్పుడు వచ్చిన లైక్ ఎపిసోడ్ మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ప్రస్తుతం చాహల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. మరి మహ్‌వశ్‌తో అతని రిలేషన్ గాసిప్స్‌గా మిగిలిపోతాయా, లేక త్వరలోనే నిజం అవుతాయా అన్నది వేచి చూడాలి!

Leave a Reply