Asia Cup 2025 : ఆసియా కప్ 2025 టీ20 నేడు ప్రారంభం.. మ్యాచ్‌లు ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చు?

2025 ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌ నేడు అంగరంగ వైభవంగా మొదలుకానుంది. ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆతిథ్యమిస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్‌ – మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ తలపడగా, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్లు పోటీపడతాయి.

టీమిండియా ఈ టోర్నీకి ప్రధాన ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ పోరు మిలియన్ల మంది అభిమానులను స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఈరోజు అఫ్గానిస్థాన్-హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతోంది.

ఎక్కడ చూడొచ్చు?
భారత్‌లో ఆసియా కప్ 2025 టీ20 మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

టీవీ ఛానెళ్లు: సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ 4 (తెలుగు & తమిళ్), సోనీ స్పోర్ట్స్ 5.

లైవ్ స్ట్రీమింగ్: సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్.
ఈరోజు మ్యాచ్ టాస్ రాత్రి 7:30కి, ఆట 8 గంటలకు ప్రారంభమవుతుంది.

భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ఓపెనింగ్ జోడీగా శుభ్‌మన్ గిల్-అభిషేక్ శర్మ, మూడో స్థానంలో తిలక్ వర్మ ఆడతారని సమాచారం. మిడిల్ ఆర్డర్‌లో సూర్య, హార్దిక్, దూబే, జితేష్ కీలక భూమిక పోషించనున్నారు.

Leave a Reply