సంజయ్ బంగర్ కూతురు సంచలనం.. న్యూడ్ ఫొటోలు పంపిన క్రికెటర్లు ఎవరు..?

భారత క్రికెట్‌లో ఓ కొత్త అంశం చర్చనీయాంశంగా మారింది. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట్లో కలకలం రేపుతోంది. లింగ మార్పిడి తర్వాత తాను ఎదుర్కొన్న వేధింపులను బహిరంగంగా వెల్లడించిన అనయా, కొందరు పేరుమోసిన క్రికెటర్లు తనని అసభ్యంగా వేధించారని ఆరోపించింది.

అనయా బంగర్ అసలు పేరు ఆర్యన్ బంగర్. అబ్బాయిగా జన్మించి, అమ్మాయిగా మారిన అనయా ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. అయితే లింగ మార్పిడి తర్వాత తన జీవితం ఎంత కష్టంగా మారిందో తెలిపింది. కొందరు క్రికెటర్లు తనికి న్యూడ్ ఫొటోలు పంపేవారని, అసభ్యంగా మెసేజ్‌లు చేస్తూ మానసికంగా వేధించేవారని పేర్కొంది.

“ముందు పబ్లిక్‌గా సపోర్ట్ చేస్తారు, ఆ తర్వాత ఛాట్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తారు” అని ఆమె వాపోయింది. ఓ సీనియర్ క్రికెటర్ తనని ఓదార్చినట్టు నటించి, తర్వాత “స్లీప్ విత్ మీ” అన్నట్టు కూడా చెప్పింది. ఇదంతా తనకు అత్యంత బాధ కలిగించే అనుభవాలుగా గుర్తుచేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by The Lallantop (@thelallantop)

తన చిన్నప్పటి రోజుల్లో ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి యువ క్రికెటర్లతో కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేసింది. కానీ అప్పుడు తన లైఫ్ గురించి ఎవరికీ చెప్పలేదని, ఎందుకంటే తన తండ్రి పేరున్న వ్యక్తి కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది.

ఐసీసీ కొత్త నిబంధనలు షాక్..!

అనయా క్రికెటర్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలనుకుంది. కానీ 2023లో ఐసీసీ తీసుకున్న నిర్ణయం వల్ల మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం లేదని తేలడంతో తన కలలు తుడిచిపెట్టుకున్నట్టు చెప్పింది. ఇది తనకు చాలా పెద్ద డిజాపాయింట్‌మెంట్ అని చెప్పింది.

Leave a Reply