సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం

లక్నోతో జరిగిన చివరి మ్యాచ్ లో ఓడిన హైదరాబాద్ ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పంజాబ్ జట్టుపై మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం కైవసం చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా టాస్ ఓడిన పీబీకేఎస్ తొలుత బ్యాటింగ్ కు దిగడం ఇది మూడోసారి. తొలి రెండు మ్యాచ్ ల్లో కేకేఆర్, ఆర్ ఆర్ లను చిత్తుగా ఓడించిన పంజాబ్ బలహీనంగా ఉన్న ఎస్ ఆర్ హెచ్ జట్టుపై గెలుపు జోరును కొనసాగించాలని చూసిన ఆట మొదటి నుండి హైదరాబాద్ మంచి ఆటను కనబరిచి విజయాన్ని కైవసం చేసుకుంది.  రెండో మ్యాచ్ కు ముందు కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మళ్ళీ రావడంతో  హైదరాబాద్ జట్టు మళ్ళీ పుంజుకుంది.

కాగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమైన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆందోళనలను పక్కన పెట్టి పీబీకేఎస్పై ఆకట్టుకునే ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయాన్ని చేజిక్కించు కుంది. ఈ మ్యాచ్లో  పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులు చేయడంతో పంజాబ్ 143/9 స్కోర్ చేసింది. ధావన్, సామ్ కరన్ (22) మినహా మిగతా పీబీకేఎస్ బ్యాట్స్ మెన్ అందరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. మయాంక్ మార్కండే 4 వికెట్లు తీయగా, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్ చెరో 2 వికెట్లు తీశారు.

తర్వాత బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్స్ లో 145 పరుగులు సాదించి విజయా పతాకాన్ని ఎగురవేసింది. రాహుల్ త్రిపాటి 74, ఏడెన్ మరకరం 37, మయంక అగర్వాల్ 21, హరీ బ్రూక్ 13పరగులు చేశారు. అరశదీప్ సింగ్ మరియు రాహుల్ చహర్ చెరో విక్కెట్ తీశాసరు.

సన్రైజర్స్ హైదరాబాద్: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, మయాంక్ డాగర్, ఫజల్హక్ ఫారూఖీ, అకీల్ హోసేన్, మార్కో జాన్సెన్, కార్తీక్ త్యాగి, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, సమర్థ్ వ్యాస్, టి నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, రాహుల్ త్రి పాఠి, ఉమ్రాన్ మాలిక్, వివ్రాంత్ శర్మ, ఉపేంద్ర యాదవ్.

పీబీకేఎస్: శిఖర్ ధావన్ (కెప్టెన్), అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, రాజ్ బావా, రాహుల్ చాహర్, సామ్ కరన్, రిషి ధావన్, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, హర్ప్రీత్ సింగ్, విద్వత్ కావేరప్ప, లియామ్ లివింగ్స్టోన్, మోహిత్ రాటే, ప్రభ్సిమ్రాన్ సింగ్, కగిసో రబాడ, ఎం షారుక్ ఖాన్, భానుకా రాజపక్స, జితేశ్ శర్మ, శివమ్ సింగ్, మాథ్యూ షార్ట్, సికందర్ రజా, అథర్వ తైడే.

Leave a Reply