YS Jagan :నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

YS Jagan :

YS Jagan :నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడలో పర్యటించారు.

నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు సందర్శించారు.

వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు తదితరులు స్వాగతం

పలికారు.నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలతో సీఎం దంపతులు ముచ్చటించారు.

మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అక్కడ నూతనంగా నిర్మించిన

భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి పయనమయ్యారు

మరొకవైపు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుని 2023 మే 30న ఐదో సంవత్సరంలోకి అడుగు

పెడుతున్న ఈ శుభసంధర్బంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సేవా కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి YS Jagan : సజ్జల

రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌రు. అనంతరం మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించామని తెలిపారు.

జగన్ గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. అలాగే  సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండావిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు.

కొత్త పథకాలకు రూపం ఇస్తూ, మరోసారి అధికారంలోకి రావడానికి పార్టీ నిరంతరం కృషి చేస్తోంది. పార్టీ నేతలు,

కార్యకర్తలు ప్రజల మధ్యన తిరగడమేగాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లతో సేవలందించడం

తమకు ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్  ఇచ్చిన టార్గెట్ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్

పార్టీ మొత్తం 175 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో

భారీగా బైక్ ర్యాలీలకు వైసీపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి.

అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్ పేదల పక్షపాతి అని దేశం గర్వించేలా ఆయన పరిపాలనYS Jagan :  సాగిస్తున్నారని

పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మరని తెలిపారు.

Leave a Reply