prime minister of india: ఫిబ్రవరి 13న తెలంగాణకు ప్రధాని

prime minister of india

 ఫిబ్రవరి 13న తెలంగాణకు ప్రధాని

 

ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు మోదీ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది.అయితే ప్రధాని మోడీ పర్యటనలో తెలంగాణకు ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.అసలు ఈనెల 19నే ప్రధాని హైదరాబాద్ రావాల్సిఉంది.

కానీ సమయంలో వందేభారత్ ను ప్రారంభించి మిగతా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమాలను రద్దు చేసి షెడ్యూల్ మార్చారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్‌ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. అప్పటి పర్యటన వాయిదా పడగా ఇప్పుడు తాజా షెడ్యూల్ ఖరారు అయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఇందులో భాగంగానే పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద నేతలంతా వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఖరారు కాగా, ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో పర్యటించేలా, సభలు, సమావేశాలతో ప్లాన్స్ రెడీ చేసుకుంది బీజేపీ.ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి ప్రధాని ని  పోటీ చేయించాలని కమలదళం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయాల్సి వస్తే మహబూబ  నగర్ లోక్‌సభ స్థానాన్ని బీజేపి హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్కడ తమకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు సమాచారం . ఇప్పటికే  ఓసారి మహూబూబ్ నగర్‌పై హోంమంత్రి అమిత్ షా  సీక్రెట్‌గా సర్వే చేయించారట. మహబూబ్ నగర్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తే  ప్రభావం ఉమ్మడి  జిల్లా, మహబూబ నగర్ రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మొదటి విడత సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది.  త్వరలో రెండో రెండో విడత సర్వే కూడా చేయనున్నట్లు సమాచారం.

మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీకి బాగానే పట్టుంది.  నేతలే కాదు కేడర్‌ కూడా ఎక్కువగానే ఉంది.  అసలు వాజ్‌పేయీ హయాంలో జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీదే మహబూబ్ నగర్ నుంచి గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో  మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. జనతా పార్టీ ఉన్న సమయంలో జైపాల్ రెడ్డి కూడా రెండు సార్లు మహబూబ్ నగర్ స్థానం నుంచి గెలుపొందారు.

అంతేకాదు ఉమ్మడి జిల్లాకు చెందిన బలమైన నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. డీకే అరుణ బీజేపీకి జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టి ఆర్ స్ నుంచి గెలిచిన జితేందర్ రెడ్డి.. ఇప్పుడు కాషాయ దళంలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్‌లో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. అక్కడి నుంచి ప్రధాని మోదీని ఎన్నికల బరిలోకి దింపితే. ఆ ప్రభావం తెలంగాణ అంతటా ఉంటుందని కాషాయ నేతలు ఆసక్తిగా  ఉన్నారు.

ఇవి కూడా చదవండి

 

Leave a Reply