Pawan Kalyan: నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులను పరామర్శించనున్న జనసేనాని
Pawan Kalyan:జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం రాజమహేంద్రవరంకు చేరుకుని అక్కడి నుంచి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటించింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం 10 గంటలకు పవన్ పర్యటన ప్రారంభం అవుతుందన్నారు. ఈ సందర్భంగా కడియంలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. తర్వాత కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. మధురపూడి విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోందన్నారు. కడియం, కొత్తపేటలో రైతులను పరామర్శించిన అనంతరం పి.గన్నవరం మండలం రాజులపాలెంలోనూ పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పలువురు నాయకులు పాల్గొననున్నారని పేర్కొంది.
Also Watch
అయితే పవన్‌కల్యాణ్ పర్యటించే కొత్తపేట మండలం అవిడి, పి.గన్నవరం నియోజకవర్గంలోని రాజుపాలెం ప్రాంతాల్లో తడిసి ముద్దయిన ధాన్యాన్ని సైతం నిబంధనలతో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్రతో పాటు సివిల్ సప్లయిస్, వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం యావత్తూ అవిడి, పి.గన్నవరం నియోజకవర్గంలోని రాజుపాలెం ప్రాంతాల్లో తడిసి ముద్దయిన ధాన్యాన్ని సైతం నిబంధనలతో సంబంధం లేకుండా తరలిo చుకుపోతున్నారు.
ఈ నెల 4వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటన ఖరారు కావడంతో 3, 4 తేదీల్లో వేగాయమ్మ పేటతో పాటు మార్గ మధ్యంలో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైసు మిల్లులకు తరలించారు. బాబు పర్యటించే ప్రాంతాల్లో సైతం రైతులు నోరు మెదపకుండా ఏ రీతిన కట్టడి చేశారో అదే స్థాయిలో జనసేన అధినేత పవన్ పర్యటించే కొత్తపేట పి.గన్నవరం నియోజకవర్గాల్లో రైతుల కట్టడికి అధికార యంత్రాంగం భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది .
రైతులను పరామర్శించనున్న జనసేనాని
రేపు రాజమండ్రి చేరుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను, నష్టపోయిన రైతులను పరామర్శించనున్న శ్రీ @PawanKalyan గారు.#JSPWithFarmers pic.twitter.com/OHwyVclxtv
— JanaSena Party (@JanaSenaParty) May 9, 2023