RBI: రూ.2000 నోట్లపై ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

RBI

RBI: రూ.2000 నోట్లపై ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

RBI: రూ.2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇప్పటి నుంచే రూ.2 వేల నోట్లను ఇవ్వటం ఆపేయాలని దేశంలోని బ్యాంకులకు సూచనలు చేసింది. అయితే, ఈ పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018‌‌–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

Also Watch

PBKS vs RR: నేటి మ్యాచ్ పిబికెఎస్ వర్సెస్ ఆర్ఆర్

అయితే దేశంలో 19 ఆర్​బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించామని పేర్కొంది.

మే 23, 2023 నుండి ఏ బ్యాంక్‌లోనైనా రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్‌లుగా మార్చుకోవడాన్ని ఒకేసారి రూ. 20,000 వరకు చేసుకోవచ్చని అపెక్స్ బ్యాంక్ తెలిపింది.

డిపాజిట్ ని అందించాలని ఆర్​బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. లేదా సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2,000 నోట్లకు మార్పిడి సౌకర్యాలు చేసుకోవాలని సూచించింది.

ఆర్బీఐ రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడానికి ఒక కారణం ఆ డినామినేషన్ను సాధారణంగా ప్రజలు లావాదేవీలకు ఉపయోగించకపోవడమే.

కొన్నేళ్లుగా ఈ నోట్ల విలువ తగ్గిందని, 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో ఇది 10.8 శాతం మాత్రమేనని ఆర్బీఐ తెలిపింది. ఇతర డినామినేషన్ల బ్యాంకు నోట్ల నిల్వలు ప్రజల అవసరాలకు సరిపోవడం మరో కారణం.

ప్రజలకు నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా ‘క్లీన్ నోట్ పాలసీ’ విధానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.2016లో రూ.500, రూ.1,000 నోట్లన్నీ రద్దయ్యాయని, అందువల్ల వాటిని చట్టబద్ధమైన నోట్లుగా ఉపయోగించలేమని, రూ.2,000 డినామినేషన్ నోట్లు చట్టబద్ధమైనవిగా కొనసాగుతాయని తెలిపింది.

మే 23 నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర డినామినేషన్ల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తన పత్రికా ప్రకటనలో తెలిపింది.

One thought on “RBI: రూ.2000 నోట్లపై ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

Leave a Reply