JEE Main 2023 Results: సత్తా చాటిన హైదరాబాద్ విద్యార్థి

JEE Main 2023 Results

JEE Main 2023 Results: సత్తా చాటిన హైదరాబాద్ విద్యార్థి

JEE Main 2023 Results: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) శనివారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షలు జనవరిలో జరగ్గా ఏప్రిల్‌ 6 నుంచి 15వరకు రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది.

Also Watch

Andhra Pradesh: మే నెలలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

ఈ  ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. JEE Main 2023 Results సెషన్-2 ఫలితాల్లో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మలై కేడియా టాపర్‌గా నిలిచాడు. అలాగే హైదరాబాద్ విద్యార్థి సింగారపు వెంకట్ కౌండిన్య మొదటి ర్యాంక్ సాధించాడు. 300/300 మార్కులు స్కోర్ సాధిచాడు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు. నెల్లూరుకు చెందిన పి.లోహిత్ ఆదిత్యసాయి 2వ ర్యాంకు సాధించాడు. లోహిత్‌.. పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల్లో చదివాడు. జూన్‌ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానని లోహిత్‌ తెలిపాడు. లోహిత్ కుటుంబం నెల్లూరులోని లక్ష్మీపురంలో నివాసముంటోంది. తండ్రి శ్రీనివాసరావు సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి వరలక్ష్మీ గృహిణి. ఇక హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సాయి దుర్గారెడ్డి 6వ ర్యాంకు, అమలాపురానికి చెందిన కే.సాయినాథ్ శ్రీమంత 10వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.

30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌

జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్‌ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్‌ 18వ తేదీన వెల్లడిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షను 8.24 లక్షల మంది విద్యార్థులు రాయగా రెండో విడత పరీక్షను దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా.

Leave a Reply