Bhuma Akhilapriya Remand: భూమా అఖిలప్రియ కు

Bhuma Akhilapriya Remand

Bhuma Akhilapriya Remand: భూమా అఖిలప్రియ కు, ఆమె భర్త కు 14 రోజుల రిమాండ్

Bhuma Akhilapriya Remand: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించి కోర్ట్. వీరిద్దరిని కర్నూలు సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది.

నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో  ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

ఈ ఘర్షణలో సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు. సుబ్బారెడ్డి  కారులో ఎక్కించి అక్కడి  నుంచి ఆస్పత్రికి తరలించారు.

మరొక వైపు  అఖిల ప్రియ కూడా తన చున్నీ లాగి, బట్టలు చించేశారని కేసు పెట్టారు. ఈ రెండు కేసులు నమోదు చేసుకున్నారు  పోలీసులు.

Also Watch

Congress: సొంతగూటికి చెరబోతున్న రాజగోపాల్‌ రెడ్డి

ఈ  ఘటనలో అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై హత్యయత్నం కేసులు నమోదుయ్యాయి. ఈ క్రమంలోనే అఖిలప్రియ పీఏ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.

అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసిన పోలీసులునేడు  నంద్యాల కోర్టులోహాజరుపర్చారు.

దీంతో కోర్టు వీరిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అఖిలతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కర్నూలు సబ్ జైలుకు తరలిస్తున్నారు.

కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వీరిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే అసలు  అఖిలప్రియకూ, ఏవీ సుబ్బారెడ్డికీ మధ్య ఎప్పటి నుంచో పోరు నడుస్తోంది.

అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమెకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు రాకుండా సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని ఆమె అనుమానిస్తున్నారు.

వాటి వివరాలు కూడా తనకు చెప్పకుండా దాచి పెట్టారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పెరిగిన గ్యాప్ కాస్తా దాడుల వరకూ వెళ్లింది. దీంతో తాజా ఘటనలు చోటు చేసుకున్నాయి.

మరోవైపు అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ ఘటనపై ఫేస్‌బుక్ లైవ్ ద్వారా స్పందించిన జస్వంతి రెడ్డి.. అఖిలప్రియను దున్నపోతు, బజారు మనిషి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

తాము పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నామని.. అందుకే ఈ ఘటన గురించి ఇప్పటివరకు ఎలాంటి  ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పారు. లోకే ష్ పాదయాత్ర డిస్టర్బ్ అవుతుందనే తాము మాట్లాడలేదని  తెలిపారు.

తండ్రి లాంటి వ్యక్తి మీద  అఖిలప్రియ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అఖిలప్రియ హత్యయత్నం చేశారని అంటుందని.. ఆమె కొంచెం అన్న బుద్ది ఉండి మాట్లాడుతుందా అని  ప్రశ్నించారు.

అఖిలప్రియ చేసే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉండవని అన్నారు. యువగళం పాదయాత్ర లైవ్‌ వీడియోను గనక చూస్తే.. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు.

Leave a Reply