బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆమె పార్టీ నుంచి సస్పెన్షన్ ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత తదుపరి అడుగు ఏమిటనేది హాట్ టాపిక్‌గా మారింది. మొదటి నుంచే పార్టీ నుంచి బయటకు వస్తే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ పార్టీని “తెలంగాణ జాగృతి” పేరుతోనే రిజిస్టర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల కవిత ప్రెస్‌మీట్‌లో సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మరియు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అవినీతికి పెద్ద కొండలని ఆమె ఆరోపించారు. వీరి చర్యల వల్లే కేసీఆర్ అప్రతిష్ట పాలయ్యారని, కాళేశ్వరం అవినీతికి వారే కారణమని కవిత పేర్కొన్నారు. అంతేకాదు, వీరు సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసీఆర్‌ను టార్గెట్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేస్తూ కవిత భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.
Also Read : కవిత సంచలన వ్యాఖ్యలు.. కాళేశ్వరం కేసులో హరీశ్ రావే అసలు దొంగ!
కవిత కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపాయి. దీంతో ఆమెపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీకి మరింత నష్టం జరగకముందే కవితను సస్పెండ్ చేయాలని అధిష్టానం చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాల్లో సస్పెన్షన్ వార్తలు వేగంగా ప్రచారం అవుతున్నాయి. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో దీనిపై కీలక చర్చ జరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, పార్టీ నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ వెలువడిన వెంటనే కవిత తన కొత్త పార్టీ “తెలంగాణ జాగృతి” పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. హరీష్ రావుకు మద్దతుగా సోషల్ మీడియాలో “ఆరడుగుల బుల్లెట్” పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాక, పార్టీ మీడియా గ్రూపుల నుండి కవిత పీఆర్‌వోను తొలగించడం ద్వారా షాక్ ఇచ్చింది.