Chikoti Praveen: క్యాసినో కేసులో అవసరమైతే అందరి పేర్లు బయటపెడతా: చికోటి ప్రవీణ్

Chikoti Praveen: తనపై క్యాసినో కేసులో వచ్చినవన్నీ ఆరోపణలేనని, వాస్తవాలేమీ లేవని చికోటి ప్రవీణ్ తెలిపారు. అలాగే అవసరం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతానని వెల్లడించారు.

అవసరమైనప్పుడు అందరి పేర్లను వెల్లడిస్తామని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ తెలిపారు. ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని, తనపై వచ్చిన ఆరోపణలన్నింటిలో ఎలాంటి వాస్తవాలు లేవని వివరించారు. ఇటీవల కొందరు హిందూ మతం, దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని దుర్గమ్మను వేడుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఆమెకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, క్రీడా పోటీలు చూసేందుకు ఏపీకి వచ్చానన్నారు. ఏపీ క్యాసినో కేసులో తనపై ఆరోపణలు తప్ప వాస్తవాలు లేవని అన్నారు. ఈడీ విచారణ కొనసాగుతుందని, అవసరమైనప్పుడు అందరి పేర్లను బయటపెడతామని వివరించారు. టీడీపీ హయాంలో కూడా ఏపీలో కోడి పందేలు ఆడారని, ఇప్పటికీ అందులో పాల్గొంటున్నారని, టీడీపీ చేస్తున్నది ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు.

Leave a Reply