మరి కాసేపట్లో తెలంగాణా మంత్రి వర్గం సమావేశం

KCR Meetes Other CMs

తెలంగాణా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ కు ఆమోదం తెలపడానికి మరి కాసేపట్లో  కేసిర్  మరియు తెలంగాణా మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. అయితే  ఎన్నికలకు ముందుగా వచ్చే చివరి బడ్జెట్ అవ్వడం వల్ల ఈ బడ్జెట్ పై అందరు చాల ఆసక్తిగా ఎదురుస్తున్నారు. అయితే, కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం తప్ప ఎజెండాలో ఇతర అంశాలు ఏమి లేవని సెక్రటేరియట్ వర్గాలు అంటున్నాయి.

ఈ భేటీలో సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేస్తారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గనిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే, కేబినెట్ సమావేశం పూర్తి  అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply