AP: ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు!
AP: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనేక వినూత్న కార్యక్రమాల తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు అందడంలో ఎలాంటి నిర్లక్ష్యం, ఆలస్యం జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
నేడు పెన్షన్ మొదలు మండల ఆఫీస్‌కు వెళ్లి చేయాల్సిన పనులు అన్ని వాలంటీర్ల ద్వారా సులభంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పక్కాగా అమలు చేస్తూ నిస్వార్ధంగా పని చేస్తున్న వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Also Watch
ఈ ఏడాది కూడా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. మే 19న విజయవాడలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఆ తరువాత నెల రోజుల పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా వాలంటీర్ల సేవలని గుర్తిస్తూ ప్రతీ ఏటా ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో వారిని సత్కరిస్తుంది.
మొత్తం మూడు రకాల అవార్డులతో వారిని ప్రభుత్వం సత్కరిస్తుంది.
తొలిసారి 2020–21లో.. రెండోసారి 2021 ఏప్రిల్ 14న.. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 7 నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయా ప్రాంతాల్లో వాలంటీర్ల పనితీరుపై కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరుతో పాటూ ప్రతినెలా మొదటి రోజునే వంద శాతం లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ..
క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు వంటి అంశాలలో పనితీరుపై అంచనా వేస్తారు. వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న అవార్డులకు ఎంపిక చేశారు.
ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు!
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ప్రదానం చేస్తారు.
ఈ అవార్డును అందుకునే వారికి రూ.30వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్‌తో సత్కరిస్తారు.
అలానే ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున.. అదే నగర కార్పొరేషన్‌కు 10 మంది చొప్పున వాలంటీర్లకు సేవారత్న అవార్డును అందజేయనున్నారు.
ఈ అవార్డు అందుకునే వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్లతో సత్కరిస్తారు.
ఇక మూడో అవార్డు విషయానికి వస్తే కనీసం ఏడాది పాటు సర్వీస్ పూర్తి చేసుకుని ఎలాంటి ఫిర్యాదుల్లేకుండా పనిచేసే మిగిలిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర అవార్డు అందజేస్తారు.
ఈ అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతిని అందిస్తారు. ఈ అవార్డులను 2021లో 2,20,993మందికి అందించగా.. 2022లో 2,33,33మందికి ప్రదానం చేశారు.
ఈ ఏడాది 90శాతంమందికిపైగా వాలంటీర్లు ఏదో ఒక అవార్డును అందుకోనున్నారు.