ఆంధ్రప్రదేశ్ లో 6 లక్షల కొత్త ఉద్యోగాలు

andhra pradesh 6lakh new jobs

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన – జగన్

రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని విశాఖపట్నం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తెలిపారు . గత రెండు రోజులుగా విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే.  ఈ సదస్సు లో గ్రీన్ ఎనర్జీ రంగంలో కొన్ని మెగా ప్రాజెక్టులు పాలుగొన్నాయి .  ఇందులో రిలయన్స్ 10 గిగావాట్ల ప్లాంటుతో సహా కొత్త ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టు బడి పెట్టడానికి ముందుకు వచ్చింది.  అలాగే  అదానీ, జిందాల్, జెఎస్డబ్ల్యు, దాల్మియా, శ్రీతో సహా భారతదేశంలోని అన్ని ప్రముఖ పారిశ్రామిక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.  20 రంగాల్లో 352 ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, అందులో ఇంధన రంగం 40 ఒప్పందాలు, రూ.8.84 లక్షల కోట్ల విలువైన హామీల ద్వారా 1.9 లక్షల మందికి ఉద్యోగ కల్పనకు అవకాశం కల్పించ నున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు జరిగిన సమావేశం లో తెలిజేశారు.

 

కాగా సదస్సులో వంద దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారని పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరిశ్రమలను స్థాపిస్తామని సీఎం తెలిపారు.  ఐటీ, ఐటీఈఎస్ రంగంలో రూ.25,587 కోట్ల పెట్టుబడులు, 1,04,442 మందికి ఉపాధి కల్పించే 56 ఎంవోయూలపై సంతకాలు జరిగాయని, పర్యాటక రంగంలో రూ.22,096 కోట్ల పెట్టుబడులకు 117 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, దీనివల్ల 30,787 మందికి ఉపాధి లభిస్తుందన్నారు సీఎం జగన్. గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించిన రంగాలలో పునరుత్పాదక ఇంధన రంగం ఒకటని, ఇవి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజ్ మరియు గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిని చాలా దూరం తీసుకెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. నికర జీరో ఉద్గారాలను సాధించే దిశగా భారత్ నిబద్ధతకు ఈ పరిణామాలు ఊతమిస్తాయని సీఎం  అన్నారు. ఈ సమ్మిట్‌ ను ఇంత  విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామి వేత్తలకు అభినందనలు తెలిపారు సీఎం.

ఇది కూడ చదవండి: 

 

 

 

Leave a Reply