ములుగు జిల్లాలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. అక్కడ వెంకటాపురం మండలం ఆలుబాకలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అదే సమయంలో జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో డీజీపీ పర్యటించనున్నారు. అక్కడ అతడికి ఎలాంటి అపాయం రాకుండా పోలీసులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.

డీజీపీ మహేందర్ రెడ్డి ఆరు నెలల్లో మూడోసారి వెంకటాపురం మండల పర్యటనకు రావడం. డీజీపీ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.