సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ మినీ స్కర్ట్‌లో ఇచ్చిన స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేలపై పడుకుని ఇచ్చిన గ్లామరస్ పోజులతో ఈ బ్యూటీ కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. మీనాక్షి గ్లామర్ షో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి, 2018 ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుని, ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది.
మీనాక్షి హిందీ చిత్రం అప్ స్టార్స్‌తో వెండితెరకు పరిచయమై, తెలుగులో హిట్: ది సెకండ్ కేస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల్లో నటించింది.
లక్కీ భాస్కర్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ కాగా, మిగతా సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.
ప్రస్తుతం మీనాక్షి చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేవు. అయితే నవీన్ పోలిశెట్టి సరసన అనగనగ ఒక రోజు సినిమాలో నటిస్తోంది.
తాజా ఫోటోషూట్‌తో మీనాక్షి మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది!