టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల తన గ్లామర్ లుక్ ను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. సాంప్రదాయ పాత్రల్లో కనిపించిన ఈ అందాల తార, తాజాగా బ్లాక్ చీరలో డిఫరెంట్ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె తాజా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘నాని’ సరసన నేను లోకల్ సినిమాతో యూత్‌కి దగ్గరైన కీర్తి, మహానటి చిత్రం తర్వాత నేషనల్ లెవెల్ స్టార్‌గా మారింది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ లెస్ రోల్స్ ప్లే చేసిన ఈ అందాల భామ, తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో అందరినీ షాక్‌కు గురి చేసింది.
బ్లాక్ చీరలో ఎలిగెంట్ స్టైల్‌తో మెరిసిపోతూ, తన హాట్ లుక్స్‌తో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. నలుపు చీరలో కీర్తి సొగసులు చూస్తూ ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఆమె నాజూకైన రూపానికి యూత్ ఫిదా అవుతూ, “కీర్తి సురేష్ ఇలా మారిపోతుందని ఊహించలేకపోయాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గ్లామర్ పెంచిన ఈ లుక్‌తో కీర్తి, కొత్త తరహా పాత్రలకు సిద్ధమవుతోందా? అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల పెళ్లి బంధంలో అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ హీరోయిన్, ప్రస్తుతానికి సినిమాల్లో బిజీగా ఉంది.
అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజా బ్లాక్ చీర ఫోటోలు ట్రెండింగ్‌లో ఉంటూ యూత్‌ను కట్టిపడేస్తున్నాయి.