తమిళ చిత్రసీమలో నటిగా మంచి గుర్తింపు పొందిన అభినయ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతోంది. ఆమె జీవిత భాగస్వామిగా కార్తీక్ అనే వ్యక్తిని ఎంపిక చేసుకుంది. పెళ్లికి ముందు ఆనందాన్ని అందరితో పంచుకుంటూ, తన స్నేహితులు, కాబోయే భర్తతో కలిసి గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసింది.
ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన అభినయ, “నమ్మలేని అనుభూతి.. జీవితాంతం గుర్తుండిపోయే పార్టీ” అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది. మ్యూజిక్, లైట్ డెకరేషన్, డాన్స్ వంటి అన్ని మసాలాలతో గ్లామరస్ బ్యాచిలర్ పార్టీ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పార్టీలో అభినయ వేసుకున్న స్టైలిష్ అవుట్‌ఫిట్, క్యూట్ కపుల్ గా ఆమెతో కలిసి కనిపించిన కార్తీక్ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అభిమానులు మాత్రం, “ప్రీ వెడ్డింగ్ మూడ్‌లో అసలైన ఫన్ చూడాలని అంటే ఇదే” అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోలతో పాటు ఆమె పెళ్లికి సంబంధించి మరిన్ని డిటైల్స్ కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అభినయ సినిమాలు తక్కువ చేసినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది.