Youngsters: రీల్స్ పిచ్చి తో బలి అవుతున్న

Youngsters

Youngsters: రీల్స్ పిచ్చి తో బలి అవుతున్న యువత

Youngsters: సోషల్ మీడియా(social media)లో బాగా పాపులర్ కావడానికి తాము చేస్తున్న వీడియోలకు ఎక్కువ వ్యూస్ రావాలని చేసే ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో బెడిసికొడుతున్నాయి. అలాంటి ఘటన ఒక  యువకుడి నిండు ప్రాణం బలిగొన్నది .  రెండు రోజుల ముందు ప్రముఖ యూట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్, బైక్ వ్లాగర్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి  చెందిన విషయం  తెలిసిందే.యూట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్ అగస్త్య చౌహాన్ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన సూపర్‌బైక్‌పై గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అగస్త్య చౌహాన్ వృత్తిరీత్యా బైకర్. అతడు తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో చేస్తూ.. మొదటిసారిగా తన జెడ్ ఎక్స్ 10ఆర్ నింజా సూపర్‌బైక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి ప్రయత్నించాడు.

అయితే బైక్ వేగంగా దూసుకుపోతున్న సమయంలో అతడు ఒక్క సారిగా తడబడ్డాడు. దీంతో బైక్ అదుపుతప్పింది. బైక్ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టింది.క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంలో అతడి హెల్మెట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో రైడర్ అక్కడికక్కడే మరణించాడు. అతడి శరీరం రక్తం చిమ్ముతూ కదలకుండా ఉండిపోయింది. అగత్స్య తలకు తీవ్ర గాయాలవడంతో ఈ మరణం సంభవించింది.

అయితే  అది మరవక ముందే ఇప్పుడు సర్ఫరాజ్ రీల్స్ కోసం  నిలబడి ఉన్న సమయంలో  రైలు  సర్షరాజ్ ను డీకొట్టడంతో  అక్కడిక్కడే  మృతి చెందాడు.  పోలీసులు ప్రాథమిక వివరాల ప్రకారం  శుక్రవారం సనత్‌నగర్‌ రైల్వే ట్రాక్‌ వద్ద ముగ్గురు స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వచ్చారు. మధ్యాహ్ననుండి   వీడియోలు  షూట్  చేశాడు.   కానీ  వారు అనుకున్నట్టుగా వీడియోలు రాలేదు.  అయితే  రైల్వే ట్రాక్ కు అతి సమీపంలో నిలబడి  సర్ఫరాజ్ రీల్స్ కోసం  నిలబడి ఉన్న సమయంలో ఇన్‌స్టా రీల్స్‌ చేస్తుండగా రైలు వేగంగా దూసుకొచ్చింది. రైలు ఢీకొనడంతో  తలకు బలమైన గాయమైన సర్ఫరాజ్  అక్కడికక్కడే మృతి చెందాడు.   అయితే రైలు వస్తున్న విషయాన్ని  సర్ఫరాజ్  కు  తెలిపారు మిత్రులు  రైల్వే ట్రాక్  నుండి పక్కకు జరగాలని సూచించారు.

కానీ  అతను  తప్పుకోలేదు.  రైల్ ఢీకొని  సర్ఫరాజ్  మృతి చెందాడు. సర్ఫరాజ్ తో పాటు  మరో ఇరువురు విద్యార్థులు రైలు రాకను గమనించి అప్రమత్తంగా వ్యవహరించడంతో సురక్షితంగా బయటపడ్డారు.మృతుడిని రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద లభించిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్ఫరాజ్‌కు సోషల్ మీడియా ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply