అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలే వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశముంది. దీంతో పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.

ఏపీలో ప్రభావిత జిల్లాలు

శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, మన్యం, కాకినాడ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఈ ప్రాంతాల్లోని ప్రజలు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలో ప్రభావిత జిల్లాలు

ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అలాగే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హన్మకొండ, జనగాం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రజలకు హెచ్చరికలు

లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి.

సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లకు దూరంగా ఉండాలి.

అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు.

Leave a Reply