War 2 Trailer: వార్ 2 ట్రైలర్ రిలీజ్.. హృతిక్-ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్, బీజీఎం అదరగొట్టేశాయి!

2025లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోలుగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించగా, హీరోయిన్ కియారా అద్వానీ కీలక రోల్‌లో కనిపించనుంది.

ముందే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు తాజాగా వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయి సినీ లవర్స్‌ను ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు. ఇందులో హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత హైప్ పెంచేశాయి.

సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ అవుతుండగా, YRF స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఆగస్ట్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Leave a Reply