Dmart : డీమార్ట్ ప్రియులకు వినాయకచవితి బంపర్ ఆఫర్.. అవసరమైన వస్తువులు సగం ధరకే!

ప్రముఖ రీటైల్ స్టోర్ డీమార్ట్ వినియోగదారుల కోసం వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక బంపర్ ఆఫర్లు ప్రకటించింది. డైలీ గ్రాసరీస్‌తో పాటు పండుగ డెకర్ ఐటమ్స్‌ను కూడా సగం ధరలకు అందుబాటులోకి తెచ్చింది.

పండగల సీజన్ అంటే షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్లతో సిద్ధమవుతాయి. ఈ క్రమంలో డీమార్ట్ వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక తగ్గింపులు ప్రకటించింది. ముఖ్యంగా ఉప్పు, పప్పు, చాక్లెట్లు, స్నాక్స్ వంటి ఎక్కువగా కొనబడే ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉన్నాయి.

డీమార్ట్ ఆఫర్లలో కొన్ని:

కందిపప్పు (1 కేజీ) – రూ.365 బదులు రూ.182

సఫోలా మీల్ మేకర్ – రూ.150 బదులు రూ.75

ఎపిస్ సీడెడ్ ఖర్జూరాలు (½ కేజీ) – రూ.199 బదులు రూ.99

ఈస్ట్రన్ కారం పొడి (½ కేజీ) – రూ.200 బదులు రూ.100

బ్రిటానియా జిమ్ జామ్ కుకీస్ – రూ.120 బదులు రూ.60

బ్రిటానియా చీజ్ స్లైసెస్ – రూ.460 బదులు రూ.230

కరాచీ చాయ్ బిస్కెట్ – రూ.180 బదులు రూ.90

యోగా బార్ మిల్లెట్ మ్యూస్లీ నట్స్ – రూ.320 బదులు రూ.160

బికాజీ చౌపతీ బేల్‌పురి (110గ్రా.) – రూ.49 బదులు రూ.24

శాని ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ (1 లీటర్) – రూ.225 బదులు రూ.112

ఇవి కాకుండా వందల కొద్దీ చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.

పండుగ అలంకరణ వస్తువులు కూడా తగ్గింపులో:

ఫ్లిప్‌కార్ట్ బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ సెట్ – అసలు ధర ₹1,299, ఇప్పుడు ₹439 (66% డిస్కౌంట్)

గణేష్ చతుర్థి డెకరేషన్ సెట్ (లతలు, కర్టెన్లు, ఫెయిరీ లైట్లు) – ₹2,999 ఉచిత షిప్పింగ్‌తో

అమెజాన్ PVC స్టాండ్ సెటప్ (లైట్స్ + పూలు) – ₹699

వినాయకచవితి పూజలకు కావలసిన సరుకుల నుండి ఇంటి అలంకరణ వరకు, ఈసారి డీమార్ట్ ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

Leave a Reply