విజయ్ దేవరకొండ కారు ప్రమాదం!

టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండకు చిన్నపాటి కారు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

విజయ్ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా హీరో విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత ఆయన స్నేహితుడి కారులో అక్కడి నుంచి బయలుదేరారు.

ప్రమాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. “నా తల కొంచెం నొప్పిగా ఉంది కానీ ఒక బిర్యానీ, నిద్ర చాలు — అంతే సరి అవుతుంది,” అంటూ సరదాగా రాశారు.

స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. విజయ్ కారుకు స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనతో విజయ్ అభిమానులు ఆందోళన చెందగా, ఆయన సోషల్ మీడియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌కి ఊరట లభించింది.

Leave a Reply