మాజీ మంత్రి విడదల రజనీకి అవినీతి కేసు లో షాక్.. మరిది గోపి అరెస్ట్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజనికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె మరిది గోపినాథ్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిలో గోపిని అదుపులోకి తీసుకున్న ఏపీ ఏసీబీ అధికారులు, స్థానిక పోలీసుల సమన్వయంతో విజయవాడకు తరలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి తొలుత తరలించి, అనంతరం విచారణ కోసం విజయవాడకు తరలించారు.

2020లో యడ్లపాడు మండలంలోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేయగా, దానిలో విడదల రజనిని ప్రధాన నిందితురాలిగా (A1) పేర్కొన్నారు.

కేసులో నిందితుల వివరాలు

A1: విడదల రజనీ (మాజీ మంత్రి)

A2: ఐపీఎస్ అధికారి జాషువా

A3: గోపినాథ్ (విడదల రజనీ మరిది)

A4: దొడ్డ రామకృష్ణ (పర్సనల్ అసిస్టెంట్)

విచారణలో భాగంగా, రజనీ వాటా రూ.2 కోట్లు, మిగతా నిందితులకు చెరో రూ.10 లక్షలు ఇవ్వబడినట్టు నమోదు చేశారు.

ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికార వర్గాల ప్రకారం, అధికార దుర్వినియోగం, అవినీతికి సంబంధించి ఇదొక కీలక దశగా భావిస్తున్నారు. మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావచ్చునన్న అంచనాలతో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది.

Leave a Reply