సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఇటీవలే అస్సాంలోని కామాఖ్యా ఆలయం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
సంతానం లేనివారు కామాఖ్యా అమ్మవారి కొండపై కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని, అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీశాయని నెటిజన్లు, పండితులు తీవ్రంగా మండిపడ్డారు.
కామాక్షి అమ్మవారి దేవాలయం నుండి వేణు స్వామిని తరిమేసిన అక్కడి అర్చకులు.#VenuSwamy #TeluguNews #Tupaki pic.twitter.com/MRDtGpzywL
— Tupaki (@tupaki_official) August 20, 2025
ఈ వివాదాల మధ్య వేణు స్వామికి మరో షాక్ ఎదురైంది. తాజాగా ఆయన కామాఖ్యా దేవి ఆలయానికి వెళ్లగా, అక్కడి అర్చకులు లోపలికి అనుమతించకుండా గుడి నుంచి బయటకు పంపించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నీ బాగోతం అంతా చూస్తున్నాం, కామాఖ్యా అమ్మవారి ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడుతున్నావు. నీ లాంటి దొంగ స్వామీజీలను మేము నమ్మము” అంటూ అర్చకులు ఆయనను బయటకు పంపించారని సమాచారం.