TS SSC RESULTS: నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
TS SSC RESULTS: తెలంగాణలో పదో తరగతి విద్యార్ధులు పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పారు అధికారులు. ఇప్పటికే నిన్న (మంగళవారం) ఇంటర్ ఫలితాలు విడుదల అవ్వగా.. ఒక్కరోజు వ్యవధిలోని పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు 10వ తరగతి రిజల్ట్స్ నేడు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ ఫలితాలు వెల్లడిస్తారు. అయితే మంత్రి ఫలితాలను విడుదల చేసిన వెంటనే విద్యార్థులు tsbie.cgg.gov.in, bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్సైట్లలో రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లలోనే కాకుండా.. ఇతర వెబ్సైట్లలో కూడా పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
అలాగే ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది 4.94 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ 03 నుంచి 11వ తేదీ మధ్య పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆరు పేపర్లే కావడంతో వాల్యుయేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేశారు. గతంలో ఫలితాల అనంతరం ఘటనల దృష్ట్యా ఈసారి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రెండు, మూడుసార్లు వెరిఫికేషన్ చేసి మరీ టెక్నికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.
Also Watch
ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్షా పేపర్ల మూల్యాంకనం ప్రారంభించారు అధికారులు. మొత్తం 18 సెంటర్లలో వాల్యూయేషన్ నిర్వహించారు. అయితే అప్లోడింగ్ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరిగింది. ఎక్కడ ఎలాంటి తప్పుదొర్లకూడదని అధికారులు చాలా జాగ్రత్తగా ఫలితాలను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అన్ని ఒకే అనుకున్న తరువాతనే నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.