World of Thama: ‘థామ’ టీజర్ రిలీజ్.. హారర్ థ్రిల్లర్‌లో భయపెట్టిన రష్మిక లుక్!

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘థామ’. ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ థామ’ పేరుతో టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో రష్మిక మందన్నా మరియు అయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ చూస్తుంటే.. ఇది ఒక భయంకరమైన ప్రేమకథగా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.

అయుష్మాన్ ఖురానా ఇందులో ‘అలోక్’ అనే చరిత్ర పరిశోధకుడిగా కనిపించబోతున్నాడు. అతడు పాతకాలం నాటి రక్త పిశాచాలపై పరిశోధన చేస్తుంటాడు. రష్మిక మాత్రం ‘తడక’ అనే అతీత శక్తులు గల పాత్రలో కనిపించనుంది.

మొత్తానికి.. టీజర్‌ను బట్టి ఈ సినిమా హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందనేది క్లారిటీ వచ్చింది.

Leave a Reply