TVK Party: 2026 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ని ప్రకటించిన విజయ్ టీవీకే పార్టీ

తమిళ సినీ హీరో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పార్టీ వ్యవస్థాపకుడైన విజయ్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే టీవీకే 2026లో ఎన్నికల్లో పోటీ చేస్తుందని గతంలో వెల్లడించింది. తాజా ప్రకటనలో బీజేపీ, డీఎంకే, ఏఐడీఎంకే లాంటి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంగా చెప్పారు. ప్రజల మద్దతుతోనే గెలుపునకు వెళ్లాలని విజయ్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువ కావడానికి సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు విజయ్ పర్యటనలు నిర్వహించనున్నారు. పార్టీ స్థాపించిన ఫిబ్రవరి 2024లో చెన్నైలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు.

ఈ సభకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరవ్వడం, ఇటీవల చెన్నైలో విజయ్‌ను కలవడం వంటి పరిణామాలు.. ఆయన పార్టీకి వ్యూహాత్మక సహకారం అందిస్తున్నారన్న వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి.

విజయ్ నాయకత్వంలో టీవీకే పార్టీ తమిళ రాజకీయాల్లో కొత్త గమనాన్ని సృష్టిస్తుందా? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికర చర్చగా మారింది.

Leave a Reply