హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. ఈ రూట్లో నడిచే వివిధ రకాల బస్సులపై 16% నుంచి 30% వరకు టికెట్ రాయితీ అందించనున్నట్లు సంస్థ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా వెల్లడించింది.
Big savings are rolling your way! #TGSRTC introduces special fare discounts on the Hyderabad ↔ Vijayawada route.
Book your tickets now 🔗 https://t.co/Pqr2EOGmhI@revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC#Telangana #Hyderabad #TakingTelanganaForward pic.twitter.com/IaGeVdDWx8
— TGSRTC (@TGSRTCHQ) July 28, 2025
గరుడ ప్లస్ బస్సులు: టికెట్ ధరపై 30% డిస్కౌంట్
ఈ-గరుడ బస్సులు: 26% రాయితీ
సూపర్ లగ్జరీ, లహరి (నాన్-ఏసీ): 20% డిస్కౌంట్
రాజధాని, లహరి (ఏసీ): 16% డిస్కౌంట్
ఈ రాయితీలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నవారికి కూడా వర్తిస్తాయని TGRTC స్పష్టం చేసింది.
గతంలో ప్రకటించిన 10% డిస్కౌంట్‌తో పోలిస్తే, తాజా ఆఫర్లు మరింత లాభదాయకంగా ఉన్నాయి. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు TGRTC అధికారులు పేర్కొన్నారు.
ఇంకా వివరాల కోసం TGRTC అధికారిక వెబ్‌సైట్ www.tgsrtc.telangana.gov.in లేదా RedBus, AbhiBus, MakeMyTrip, Goibibo వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను సందర్శించవచ్చు.