తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్న ఘటన తలెత్తింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన నివాసంలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందారు.
స్వేచ్ఛ దాదాపు 18 సంవత్సరాల పాటు పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో యాంకర్‌గా పనిచేశారు. పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న ఆమెకు ఓ కుమార్తె ఉంది. ఇటీవల ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. కానీ ఆ సంబంధంలో ఏర్పడిన విభేదాలే ఆమె ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య
టీ న్యూస్ చానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య
సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు
జవహర్ నగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య.. బాడీని గాంధీ ఆసుపత్రికి తరలింపు
ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్లోనివాసం ఉంటున్న యాంకర్ స్వేచ్చ pic.twitter.com/VlqrGZsnlA
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2025
ఈ ఘటనపై స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులు రాంనగర్‌లో నివసిస్తున్నారు. స్వేచ్ఛ తండ్రి శంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో కార్యకర్తగా పనిచేశారు.
ప్రస్తుతం స్వేచ్ఛ మృతికి గల ఖచ్చిత కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మీడియా వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.