తెలంగాణలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలల వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందే ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారమే సెలవులు ఉండనున్నాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నా, కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ముందుగానే సెలవులు వస్తాయన్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. వాటికి చెక్ పెడుతూ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పాఠశాలలకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి:
సెలవుల ప్రారంభం: ఏప్రిల్ 24
పునఃప్రారంభం: జూన్ 12
మొత్తం సెలవులు: 46 రోజులు
ఈ సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ స్కూల్స్‌కి వర్తిస్తాయి.
ఇంటర్ కళాశాలలకు సెలవుల డేట్స్ ఇలా:
సెలవుల ప్రారంభం: మార్చి 31
పునఃప్రారంభం: జూన్ 2
ఇంటర్ బోర్డు నుంచి విడుదలైన ఉత్తర్వుల ప్రకారం, సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వేసవి సెలవులకు సంబంధించి వచ్చే ఏవైనా గాసిప్స్‌కి కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం స్కూళ్లు, కాలేజీలు మూతపడే తేదీలు ఇవే.