Telangana Rains: తెలంగాణలో 9 జిల్లాలకు భారీ వర్ష సూచన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారుల మరియు సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండమని అన్నారు. శనివారం ఉదయం వర్షాల పరిస్థితి గురించి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం 15 జిల్లాల్లో అధిక వర్షాలు, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదయ్యాయని సీఎం తెలిపారు.

వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో SDRF, NDRF బృందాలను ముందుగానే మొహరించాలని, కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు.

రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను పరిశీలించి నీటి స్థాయిని అంచనా వేయాలని, అవసరమైతే ముందుగానే నీటిని విడుదల చేయాలని, ప్రజలకు సమాచారం అందించాలని ఆదేశించారు. నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రోడ్లపై వరద నీరు ఉంటే రాకపోకలను ముందుగానే నిలిపివేయాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించాల్సిన ఆదేశాలు ఇచ్చారు.

వర్షపు నీరు నిల్వ, దోమలు మరియు ఇతర క్రిమికీటకాలు అంటువ్యాధుల ప్రమాదం కలిగిస్తాయని సీఎం హెచ్చరించారు. నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేయాలని, వైద్యశాఖ తగినంత మందిని అందుబాటులో ఉంచాలని, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రాణ, ఆస్తి, పశు నష్టాలు తగలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని, జీహెచ్ఎంసీ, హైడ్రా, SDRF, అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రజల నుంచి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

Leave a Reply