తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. మూడు నెలలలోగా, అంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ టి. మాధవిదేవి నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వానికి ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
హైకోర్టు ముందు ఈసీ, ప్రభుత్వ అభ్యర్థనలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 60 రోజుల గడువు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కోర్టులో అభ్యర్థించగా, హైకోర్టు అంగీకరించింది. అలాగే, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కోరిన 30 రోజుల సమయాన్ని కూడా కోర్టు అనుమతించింది.
తెలంగాణ స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని జస్టిస్ మాధవి దేవి బెంచ్ ఆదేశించింది.
ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా… pic.twitter.com/Zb5BX66I7W
— The Bharat (@TheBharat_News) June 25, 2025
పిటిషన్ల నేపథ్యంలో తీర్పు
గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. అయినప్పటికీ కొత్త ఎన్నికలు నిర్వహించకపోవడంతో పలు గ్రామాల మాజీ సర్పంచులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌లపై విచారణ చేపట్టిన హైకోర్టు, తుది తీర్పును ఈ రోజు వెల్లడించింది.
సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత పంచాయతీ బాధ్యతలు ప్రత్యేక అధికారులకు అప్పగించడాన్ని కూడా పిటిషనర్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలని స్పష్టం చేసింది.