Telangana Rains : ఈ నెల 26, 27న తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలు అప్రమత్తం!

గడచిన కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలు ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షం విపరీతంగా కురుస్తుండటంతో నగర వాసులకు సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉంది. 25న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటనుంది.

26వ తేదీ: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి పలు చోట్ల 10-20 సెం.మీ. వర్షం కురిసే అవకాశం.

27వ తేదీ: ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి అక్కడక్కడ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం, ముఖ్యంగా సాయంత్రం సమయంలో పడే అవకాశం ఉంది.

జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారు.

ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

Leave a Reply