TG Dasara Holidays : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. బతుకమ్మ, దసరా పండుగలను కలిపి మొత్తం 13 రోజుల పాటు ఈసారి సెలవులు ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. తిరిగి అక్టోబర్ 4న స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే పండగల్లో బతుకమ్మ, దసరా ఒకటి. ఈ పండుగలు రాగానే విద్యార్థులకు కూడా ఆనందమే. ఈసారి వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు, అక్టోబర్ 2 గాంధీ జయంతి కూడా ఈ సెలవుల్లోనే కలిసిపోవడం మరో విశేషం.

లాంగ్ హాలీడేస్ కావడంతో నగరాల్లో నివసించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కుటుంబాలతో కలిసి సొంత ఊర్ల బాట పడుతున్నారు. దీంతో బతుకమ్మ, దసరా వేడుకలు మరింత ఉత్సాహంగా జరగనున్నాయి.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే ప్రకటించారు. అంటే, ఏపీలో 10 రోజులు సెలవులు ఇవ్వగా, తెలంగాణ విద్యార్థులకు 13 రోజుల హాలీడే లభిస్తోంది. క్రిస్టియన్, మైనారిటీ స్కూళ్లకు మాత్రం వేరే తేదీల్లో (సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు) సెలవులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఈ వారం కూడా విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ, 6న ఖైరతాబాద్ వినాయక నిమ్మజ్జనం, 7న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు వచ్చాయి. దీంతో సెప్టెంబర్ మొత్తం విద్యార్థులకు సెలవులతోనే గడిచిపోనుంది.

Leave a Reply