తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం స్థానిక ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారింది.
ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్చార్జిలను నియమించిన కాంగ్రెస్ పార్టీ
వంశీ చంద్ రెడ్డి – ఖమ్మం
సంపత్ కుమార్ – నల్గొండ
అడ్లూరి లక్ష్మణ్ – వరంగల్
పొన్నం ప్రభాకర్ – మెదక్
జగ్గారెడ్డి – హైదరాబాద్
కుసుమకుమార్ – మహబూబ్ నగర్
అనిల్ యాదవ్ – ఆదిలాబాద్
అద్దంకి దయాకర్ – కరీంనగర్
అజ్మత్ హుసేన్ -… pic.twitter.com/235FUsGlHB— Telugu Galaxy (@Telugu_Galaxy) July 7, 2025
ఇన్‌ఛార్జీలుగా నియమితులైన వారు:
ఖమ్మం – వంశీ చంద్ రెడ్డి
నల్గొండ – సంపత్ కుమార్
వరంగల్ – అడ్లూరి లక్ష్మణ్
మెదక్ – పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – జగ్గారెడ్డి
మహబూబ్ నగర్ – కుసుమకుమార్
ఆదిలాబాద్ – అనిల్ యాదవ్
కరీంనగర్ – అద్దంకి దయాకర్
నిజామాబాద్ – అజ్మత్ హుస్సేన్
రంగారెడ్డి – శివసేనా రెడ్డి
ఈ నేతలు తమ తమ జిల్లాల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను వేగంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త కమిటీల ఆధారంగా పార్టీ రూట్ లెవెల్‌లో బలోపేతం కావడం గ్యారంటీ అంటున్నారు పార్టీ వర్గాలు.
స్థానిక ఎన్నికల దృష్ట్యా..
ముందుచూపుతో ముందస్తుగా చర్యలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ కొత్త కమిటీల సారథ్యంలో స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. నియమితులైన ఇన్‌ఛార్జీలు త్వరలో పర్యటనలు చేపట్టి స్థానిక నేతలతో సమన్వయం చేసుకోనున్నారు.