Telangana congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ పోటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ సమరం నెలకొననుంది. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇది ఒక ట్రైలర్‌గా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా పోటీ

జూబ్లీహిల్స్‌ సీటును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలువురు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అజహరుద్దీన్‌తో పాటు మరికొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నెల 30న జూబ్లీహిల్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి శక్తి ప్రదర్శన చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితర నేతలు హాజరుకానున్నారు.

Also Read : ఏపీలో గణేష్ మండపాలకు శుభవార్త.. ఫ్రీగా ఆ సదుపాయం కల్పించిన ప్రభుత్వం

మొదట ఈ సభ ఈ రోజు జరగాల్సి ఉన్నా, బిహార్‌లో రాహుల్ గాంధీ యాత్రలో సీఎం రేవంత్ పాల్గొనడం వల్ల వాయిదా పడింది. అయితే పార్టీ వర్గాల ప్రకారం ఈ సభ అసలైన లక్ష్యం రాబోయే ఉప ఎన్నిక అని స్పష్టమవుతోంది.

ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు

ప్రస్తుతం ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. కానీ ప్రధాన పార్టీలు ముందుగానే వ్యూహరచన మొదలుపెట్టాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది.

తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారులను నియమించింది.

ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ అనురాగ్ జయంతి (ప్రధాన నోడల్ అధికారి)

కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ చౌవన్ (ఈవీఎంలు, వివిప్యాట్‌)

సి.టి.ఓ శ్రీనివాస్ (ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్)

ఎల్‌.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ (ట్రైనింగ్)

కె. వేణుగోపాల్ (మెటీరియల్ మేనేజ్మెంట్)

అదనంగా ఎస్పీ ఎం. సుదర్శన్ (ఎంసీసీ), డీఎస్పీ నరసింహా రెడ్డి (లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ), బి. గీతా రాధిక (ఎక్స్పెండిచర్ మానిటరింగ్) తదితరులు నియమించబడ్డారు. అలాగే మీడియా, ఐటీ, హెల్ప్‌లైన్, సైబర్ సెక్యూరిటీ, వెబ్‌కాస్టింగ్ వంటి విభాగాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply