కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, “కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిదే” అని అన్నారు. కేటీఆర్‌ను గతంలో ఎన్నో సార్లు కలిశానని, “కేటీఆర్‌ను కలుస్తే తప్పేంటి?” అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారన్నారు.
అంతేకాక, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ సభ్యులు ఓటు వేయడంపై లోకేష్ స్పందించారు. “ఆ అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలి” అని పేర్కొన్నారు.
కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్‌రెడ్డిని అడగాలా.?!!
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అవును కేటీఆర్ నీ కలిసా, బరాబర్ కలుస్తా.!
కేటీఆర్ నేను ఎందుకు కలుసుకోకూడదు.?చాలా సార్లు కేటీఆర్‌ను కలిశాను మళ్ళీ కూడా అవసరం అనుకున్నప్పుడు కలుస్తాం.!
కల్వకుంట్ల కవితను టి-టీడీపీలో… pic.twitter.com/qcrn6cgi5V
— Telugu Reporter (@TeluguReporter_) September 9, 2025
రాబోయే 2029 ఎన్నికల్లో కూడా మేము మోదీకి మద్దతు ఇస్తామన్నారు. మోదీ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నట్టు స్పష్టం చేశారు. అలాగే, దేవాన్ష్ రాజకీయాల్లో వస్తున్నారా అన్న ప్రశ్నకు ఫన్నీ సమాధానం ఇచ్చారు. “అతను హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నాడు” అని అన్నారు.
లోకేష్ గత జగన్ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్‌లు జరిగాయని, అవన్నీ బయటకు వస్తాయని చెప్పారు. “అందుకోసం జగన్ బెంగుళూరులో ఉన్నాడు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ మీద ఫోకస్ పెడుతున్నామని, ఆ రాష్ట్రంలో కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.