TCSలో 12 వేల ఉద్యోగులకు షాక్..! కంపెనీ బిగ్ డెసిషన్

ప్రముఖ ఐటీ దిగ్గజం TCS భారీ షాకిచ్చింది. రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి తమ సంస్థలో పనిచేస్తున్న 2% ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. అంటే సుమారు 12,000 మందికి పైగా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది.

సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీసీఎస్ CEO కే. కృతివాసన్ వెల్లడించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉంది. అందులో 2% కోత విధిస్తే దాదాపు 12,200 మంది ప్రభావితమవుతారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఏఐ (AI), ఆపరేటింగ్ మోడల్స్ మార్పులపై దృష్టి పెడుతోందని కృతివాసన్ పేర్కొన్నారు. “మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను అంచనా వేస్తున్నాం. కెరీర్ వృద్ధికి పెట్టుబడులు పెడుతున్నాం. అయితే కొన్ని రోల్స్‌లో ఇది పనిచేయడం లేదని గుర్తించాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న టీసీఎస్ ఉద్యోగాలపై ప్రభావం చూపనుంది.

Leave a Reply