Anchor Swetcha Case: స్వేచ్ఛ మృతిపై పూర్ణచందర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..!

తెలుగు న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతిచెందిన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమె బలవన్మరణానికి కారణమయ్యాడన్న ఆరోపణల నేపథ్యంలో పూర్ణచందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రిపోర్టులో పేర్కొన్న ప్రకారం, పూర్ణచందర్ గత నాలుగేళ్లుగా స్వేచ్ఛతో పెళ్లి చేసుకుంటానంటూ సహజీవనం చేస్తున్నాడని, ఈ కాలంలో లైంగికంగా దగ్గరయ్యాడని, స్వేచ్ఛను పలువురు రాజకీయ నాయకులకు, మీడియా ఉద్యోగులకు పరిచయం చేశాడని పోలీసులు తెలిపారు.

స్వేచ్ఛ పెళ్లి విషయాన్ని పలుమార్లు ప్రస్తావించగా, పూర్ణచందర్ వెనుకడుగేసి, ఓ సందర్భంలో ఆమెపై దౌర్జన్యం చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ మోసాన్ని గుర్తించిన స్వేచ్ఛ తీవ్ర మనోవేదనకు గురై, జవహర్‌నగర్ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు.

స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్లు 69, 108 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, రిమాండ్‌కు హాజరుపరిచారు. ఇదే సమయంలో తనపై వచ్చిన ఆరోపణల ఆధారంగా, స్వేచ్ఛ కూతురి స్టేట్‌మెంట్ ప్రకారం పూర్ణచందర్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

ఇంతకాలం పాటు సహజీవనం చేసిన తర్వాత పూర్ణచందర్ తనను పూర్తిగా విస్మరించాడన్న విషయాన్ని గ్రహించిన స్వేచ్ఛ తీవ్రంగా నొచ్చుకొని తుది నిర్ణయం తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply