Firecrackers Ban: దేశం మొత్తం టపాసులకు బ్యాన్.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

స్వచ్ఛమైన గాలి ప్రతి భారతీయుడి హక్కు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఢిల్లీ వాయుకాలుష్యం, దీపావళి టపాసుల నిషేధం అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా టపాసుల తయారీ, అమ్మకం, వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తేనే ప్రజలకు క్లీన్ ఎయిర్ అందుబాటులో ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. “సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది కాబట్టి కేవలం ఢిల్లీ ప్రజలకే కాదు.. అమృత్ సర్ సహా దేశంలోని ప్రతీ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలి అవసరం” అని చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.

“ఇటీవల అమృత్ సర్ వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీ కంటే ఎక్కువ కాలుష్యం కనిపించింది. కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందాలంటే దేశం మొత్తం టపాసులపై బ్యాన్ అవసరం” అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం కూడా దానికి కారణమని సుప్రీంకోర్టు గుర్తించింది. అందుకే గతంలోనే ఢిల్లీలో టపాసుల విక్రయాలు, వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని దేశమంతటా విస్తరించాలని సూచించింది.

“ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. ఇది సాధారణ ప్రజల ప్రాణాలను కూడా తీస్తోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, పేదవర్గాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుగోలు చేయలేని వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది” అని సుప్రీంకోర్టు జడ్జిలు ఏఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు.

Leave a Reply