Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా..?

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దసరా బోనస్(Dasara Bonus) ప్రకటించింది. ఒక్కొక్క పర్మినెంట్ కార్మికుడికి రూ.1,95,610 బోనస్ అందనుంది. కాంట్రాక్ట్ కార్మికుల కోసం రూ.5,500 బోనస్ ప్రకటించింది. ఈ వివరాలను సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ సంవత్సరం సింగరేణి లాభం రూ.2,360 కోట్లు ఉండగా, లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.819 కోట్లు బోనస్‌గా అందించబడనున్నాయి.

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పోరాటం చరిత్రలో ఎప్పటికీ మరువదని సీఎం రేవంత్ తెలిపారు. సింగరేణి లాభాలను పెంచడానికి కార్మికులు చేసిన కృషి విలువైనదని పేర్కొన్నారు. అందువల్ల లాభాల్లో వాటాలను కార్మికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ కంపెనీలతో సింగరేణిని పోటీ చేయదగిన విధంగా తీర్చిదిద్దతామని హామీ ఇచ్చారు.

సింగరేణి మొత్తం ఆదాయం రూ.6,394 కోట్లు. ఇందులో రూ.4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించారు. నికర లాభం రూ.1,236 కోట్లు. ఇందులో 34% అయిన రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికుల బోనస్ కోసం కేటాయించబడింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ఇవ్వనున్నారు.

ప్రైవేట్ గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని, కేంద్రంతో సమస్య పరిష్కారానికి చర్చిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో కార్మికులకు అండగా ఉండి సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దీపావళికి కూడా కార్మికులకు అదనపు బోనస్ ఇవ్వనున్నారు.

Leave a Reply