ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, “వితండవాదం చేయడంలో వైసీపీ ముందుంది. మహిళా ఎమ్మెల్యేను దూషించిన వారిని జగన్ పరామర్శించడం దురదృష్టకరం. జగన్ లాంటి నాయకులు మనకు అవసరమా?” అని ప్రశ్నించారు.
ప్రస్తుతం పేదలకు ఏడాదికి రూ.32,146 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామని, ఇంత గొప్ప కార్యక్రమం ఇంకేదైనా ఉందా అని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. “ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నాం” అని చెప్పారు.
సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు అంటే నా వల్లే – సీఎం చంద్రబాబు pic.twitter.com/S17Y48cV6Q
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2025
రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆలోచనలతోనే సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయని, రూ.3800 కోట్లతో హంద్రీనీవా పనులు ప్రారంభించామని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వినియోగిస్తే రాయలసీమలో కరువు ఉండదని, పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఐటీ రంగం అభివృద్ధిపై మాట్లాడుతూ, తన హయాంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఐటీ విస్తరించిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ను మొట్టమొదటగా హైదరాబాద్‌కు తీసుకువచ్చింది తానేనని, “సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడంటే అది కూడా నా వల్లే” అని ఘనంగా ప్రకటించారు.