Roja vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన కామెంట్స్ !

మాజీ మంత్రి రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘గాలిలో గెలిచిన గాలినా కోడుకులు రాష్ట్రంలో ఎక్కువైపోయారు’’ అంటూ టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘ఇప్పుడే హైదరాబాద్ పారిపోతున్న వాళ్లు, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే హైదరాబాద్ కాదు.. నేరుగా అమెరికా పారిపోవాల్సిందే. అప్పుడు వాళ్లను ఎవరూ కాపాడలేరు’’ అని హెచ్చరించారు.

ప్రస్తుతం వైసీపీ నేతలపై పెట్టే కేసులు, టార్చర్ అన్నిటినీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను ఎద్దేవా చేస్తూ, ‘‘పవన్‌కు పిచ్చి పీక్స్‌కి చేరింది. ఎక్కడికెళ్లినా అక్కడే పుట్టానని చెబుతున్నాడు. ఒక సినిమాలో ‘కొంచెం తిక్క ఉంది, దానికి ఓ లెక్కుంది’ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు బాబా లెక్క ఇస్తున్నట్టున్నాడు, ఆ లెక్క పీక్స్‌కి వెళ్తోంది’’ అన్నారు.

అలాగే పవన్‌పై మరోసారి దాడి చేస్తూ, ‘‘అందరూ వీకెండ్‌లో సొంతూరికి వెళ్తారు, కానీ పవన్ మాత్రం వీకెండ్‌లో మాత్రమే ఏపీకి వస్తాడు. వారం మొత్తం షూటింగ్లు చూసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉంటాడు’’ అని విమర్శించారు. టీటీడీ ఎస్వీ గోశాలలో గోవులు చనిపోయినా, శ్రీశైలంలో తాంబేళ్లు చనిపోయినా పవన్ కనీసం అక్కడకు వెళ్లలేదని, కానీ తమిళనాడుకు వెళ్లి డ్రామా చేస్తాడని మండిపడ్డారు.

Leave a Reply